మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో రెండో రోజు సోదాలు

15 Dec, 2022 21:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో రెండో రోజు కూడా సోదాలు నిర్వహించారు. సుమారు 10 గంటల పాటు తనిఖీలు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లను సేకరించి చిట్టీల సొమ్మును ఇతర సంస్థల్లోకి మళ్లించిన మార్గద­ర్శి చిట్‌ఫండ్‌ వ్యవహారాలపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

అధికారుల తనిఖీలను వీడియో కెమెరాల్లో చిత్రీకరించారు. సొంత మీడియాతో అధికారుల విధులకు మార్గదర్శి యాజమాన్యం ఆటంకం కలిగించింది. పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డిస్క్ లోని సమాచారం అధికారులు సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫిక్స్ డిపాజిట్లు సేకరించినట్టు అనుమానం వ్యక్తమవుతుంది. ఇతర గ్రూప్ ఆఫ్ కంపెనీలకు మర్గదర్శి నిధుల మళ్లింపుపై అధికారులు ఆరా తీశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మార్గదర్శి కార్యాలయాల్లో మూడు విడతలు సోదాలు నిర్వహించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు సోదాల్లో లభ్యమైన సమాచారం ఆధారంగా హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఎంత మంది డిపాజిట్‌ చేశారన్న వివరాలను వెల్లడించకుండా మార్గదర్శి గుట్టుగా వ్యవహరిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రజల సొమ్మును ఇతర సంస్థలకు మళ్లించినట్లు పక్కా ఆధారాలు లభ్యమైన తరువాతే హైదరాబాద్‌లోని కార్యాలయంలో సోదాలు చేపట్టినట్లు అధికార వర్గాల సమాచారం. 
చదవండి: వేగులం కాదు.. ప్రజా సేవకులం

>
మరిన్ని వార్తలు