వారంతా బడ్జెట్‌పై మాట్లాడలేదు.. అంటే!..

6 Feb, 2021 16:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంతి​ కే.చంద్రశేఖర్‌రావుతో సహా అగ్ర నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాట్లాడలేదని, అంటే! బడ్జెట్‌పై వారు సంతోషంగా ఉన్నట్లు స్పష్టం అవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రధాని నరేంద్రమోదీ అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనురాగ్ బడ్జెట్ రూప కల్పనలో కీలకపాత్ర పోషించారు. ప్రతిపక్షాలు కావాలనే దేశవ్యాప్తంగా విమర్శలు చేస్తున్నాయి. సంక్షేమం పేరుతో ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు.

సంక్షేమం ముఖ్యమే కానీ, అభివృద్ధి అంతకన్నా ముఖ్యం. సంక్షేమ పథకాల నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. అభివృద్ధి కూడా కుంటుపడుతోంది. కరోనా విపత్తులోనూ బడ్జెట్ నిధులను కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంది. బడ్జెట్‌ను రాజకీయ కోణంలో చూడకూడదు. మోదీ నేతృత్వంలో శక్తివంతమైన భారత్ కోసం పని చేస్తున్నాం. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో బీజేపీ పనిచేస్తుంది’’ అని అన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు