గ్రేటర్‌లో అందరికీ ఉచితంగా కరోనా టీకా

26 Nov, 2020 13:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భాగ్యనగర్‌ వాసులపై బీజేపీ వరాల జల్లు కురిపించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకర్శించేందుకు మేనిఫెస్టోను తయారుచేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవంద్ర ఫడ్నవిస్‌ గురువారం పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. బిహార్‌ అసెంబ్లీ సందర్భంగా ఇచ్చిన ఉచిత కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రయోగాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని కాషాయదళం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే హైదరాబాద్‌ ప్రజలందరికీ ఉచిక కరోనా టీకాను అందిస్తామని హామీనిచ్చింది. అంతేకాకుండా విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్స్‌, ఫ్రీ వైఫై సదుపాయాన్ని ఇస్తామంది. మహిళలకు బస్సులు, మెట్రోలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని బీజేపీ హామీనిచ్చింది. అందరి ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మేనిఫెస్టో ఉంటుందని ఫడ్నవిస్‌ అన్నారు. పేద బడుగు బలహీన మధ్య తరగతి వర్గాలకు చెందిన విధంగా మేనిఫెస్టో రూపొందించ బడిందని పేర్కొన్నారు. (గ్రేటర్‌ పోరు: మాటల యుద్ధం.. వివాదాస్పదం!)

మేనిఫెస్టోలోని అంశాలు..

 • మహిళలకు బస్సులు, మెట్రోలో ఉచిత ప్రయాణం
 • గ్రేటర్‌లో బీజేపీ గెలిస్తే.. హైదరాబాద్‌లో అందరికీ ఉచితంగా కరోనా టీకాలు
 • నివాస ప్రాంతాల్లో అందరికీ ఉచితంగా మంచినీరు
 • బస్తీల్లో వందశాతం ఆస్తి పన్ను మాఫీఎల్ఆర్ఎస్ రద్దుతో15 వేల కోట్ల భారం ప్రజలపై పడకుండా విముక్తి
 • వరదల్లో నష్టపోయిన వారికి 25 వేల రూపాయలు అకౌంట్‌లో పడుతాయి
 • ప్రధానమంత్రి అవాస్ యోజన కింద అందరికి గృహ నిర్మాణాలు
 • మెట్రో  రైలు ,సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
 • ఆన్‌లైన్‌ క్లాస్‌లకు ఉచిత ట్యాబ్లు
 • ప్రయివేటు స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణ
 • ఉచిత నల్లా కనెక్షన్ ఉచిత నీరు అందించడం
 • మూసి ప్రక్షాళన..10 వేల కోట్లతో సుమేధ కొత్త చట్టం
 • సుమేధ ద్వారా నాలల నిర్మాణం అక్రమ కట్టడాలు కూల్చివేత
 • పేదలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
 • మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్
 • గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు
 • గ్రేటర్‌లో ఇంటింటికి నల్లా కనెక్షన్.. 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా
 • కులవృత్తులకు ఉచిత విద్యుత్ ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు