మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు బ్రిడ్జి కోర్సు

20 Jun, 2022 01:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా, ఇతర వర్సిటీల సహకారంతో జర్నలిస్టుల కోసం ఒక బ్రిడ్జి కోర్సుకు రూపకల్పన చేస్తున్నామని, సర్టిఫికెట్‌ సైతం జారీ చేస్తామని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. హైదరాబాద్‌ జర్నలిస్టుల కోసం మీడియా అకాడమీ నిర్వహించిన రెండు రోజుల శిక్షణా శిబిరం ముగింపులో ఆయన మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఆచరణ లో పెట్టాలని జర్నలిస్టులకు సూచించారు.

9 ఉమ్మడి జిల్లాల్లో తరగతులు నిర్వహించి ఆరు వేల మంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చామని, దళిత, మహిళా, హైదరాబాద్‌ జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణా తరగతుల నిర్వహణతో మరో 1,000 మంది లబ్ధి పొందారని చెప్పారు. అకాడమీ 12 పుస్తకాలు ప్రచురించి జర్నలి స్టులకు అందజేసిందని, అకాడమీ కోసం నిర్మిస్తున్న నూతన భవనంలో ఒక ఆడిటో రియం, ఒక డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ ఉంటాయని తెలిపారు. రెండు రోజుల శిక్షణ తరగతుల్లో పాల్గొన్న జర్నలిస్టులకు వెటరన్‌ జర్నలిస్ట్, ‘మహిళా విజయం’ మాస పత్రిక సంపాదకు రాలు, వాసిరెడ్డి కాశీరత్నం చేతుల మీదుగా సర్టిఫికెట్స్‌ అందజేశారు.   

మరిన్ని వార్తలు