ఆ పిల్లి... కోలుకుంటోంది!

5 Jul, 2022 16:13 IST|Sakshi

ఆపదలో పిల్లి.. ట్విట్టర్‌లో ఫిర్యాదు.. స్పందించిన అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: అత్తాపూర్‌ పిల్లర్‌నెంబర్‌ 102 వద్ద ఒక పిల్లి కాలువిరిగి పడి ఉండటాన్ని చూసిన పౌరుడొకరు  తగిన సహాయం చేయాలని మునిసిపల్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవిద్‌కుమార్‌ను ట్విటర్‌ ద్వారా కోరారు. అందుకు స్పందించిన ఆయన జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులను ఆదేశించడంతో జీహెచ్‌ఎంసీ చీఫ్‌ వెటర్నరీ ఆఫీసర్‌ వెంటనే స్పందించారు. పిల్లిని చుడీబజార్‌లోని యానిమల్‌ కేర్‌ సెంటర్‌కు తరలించారు. ముగ్గురు డాక్టర్ల బృందం తగిన వైద్య చర్యలు చేపట్టడంతో పిల్లి కోలుకుంది.  

ముగ్గురు పశువైద్యుల బృందంతో అత్యవసర చికిత్సం అనంతరం ఆ పిల్లి కోలుకుంటోంది. జ్వరం నుంచి కోలుకుని, టెంపరేచర్‌ సాధారణ స్థితికి వచ్చింది. కొద్దిగా పాలు కూడా తీసుకుందంటూ స్వయంగా అరవింద్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. పిల్లి గురించి ఒక సామాన్య యువకుడి  ట్వీట్‌ పై  స్పెషల్ చీఫ్ సెక్రటరీ,గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వకీల్  స్పందించిన తీరు ప్రశంసలు దక్కించుకుంటోంది. 

మరిన్ని వార్తలు