మ‌ధ్య‌వ‌ర్తిత్వంలో ఐఏఎంసీ కీల‌కపాత్ర: సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ

18 Dec, 2021 16:06 IST|Sakshi

ఐఏఎంసీ ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కే.చంద్ర‌శేఖర్ రావు(కేసీఆర్‌) శనివారం ప్రారంభించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఐఏఎంసీ ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు.  రాజీ-మ‌ధ్య‌వ‌ర్తిత్వంలో ఐఏఎంసీ కీల‌కపాత్ర పోషిస్తుంద‌న్నారు. త‌క్కువ కాలంలో మంచి వ‌స‌తుల‌తో ఐఏఎంసీ ఏర్పాటైందని.. ఐఏఎంసీ ఏర్పాటుకు స‌హ‌క‌రించిన సీఎం కేసీఆర్‌కు ఎన్వీ ర‌మ‌ణ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

చదవండి: వచ్చే ఐదేళ్లలో 50 వేల ఉద్యోగాలు! 

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు దీటుగా హైద‌రాబాద్‌: సీఎం కేసీఆర్‌
సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు దీటుగా హైద‌రాబాద్ పురోగ‌మిస్తోందని.. అనేక రంగాల్లో హైద‌రాబాద్ కేంద్ర బిందువుగా మారుతోందన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ  ప్ర‌ధాన పాత్ర పోషించారన్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు.

>
మరిన్ని వార్తలు