వికారాబాద్‌లో సీఎం కేసీఆర్‌.. కలెక్టరేట్‌, టీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ ప్రారంభం

16 Aug, 2022 16:44 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌: వికారాబాద్‌లో పర్యటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వికారాబాద్‌ పట్టణానికి చేరుకున్నారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌తో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ఉస్మానియా మెడికల్‌ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేసీఆర్‌. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

శాఖలన్నీ ఒకే గూటికి..  
వాస్తవానికి కలెక్టరేట్‌ భవనం ఏడాది క్రితమే పూర్తయ్యింది. సీఎంకు సమయం కుదరకపోవడంతో ప్రారంభోత్సవం కోసం ఇన్నాళ్లు వేచి చూడాల్సి వచ్చింది. తాజాగా రూ.42 కోట్ల వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కలెక్టరేట్‌ భవనం అందుబాటులోకి వచ్చింది. దీంతో జిల్లా కేంద్రంలో శాఖలన్నీ ఒకే గూటికి చేరుకున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టరేట్‌ భవనంలో కేవలం డజన్‌ శాఖలు మాత్రమే ఉండగా కీలక శాఖలన్నీ బయటే కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: Hyderabad: పోలీసు ఫోన్‌ నెంబర్లు మారాయి.. కొత్త నెంబర్లు ఇవే

మరిన్ని వార్తలు