అమ్మకానికి బొగ్గు గనులు.. సింగరేణి పాల్గొంటుందా? లేదా?

30 Mar, 2023 07:17 IST|Sakshi

ఏడో రౌండ్‌లో దేశంలోని 106 గనులు..

అందులో సింగరేణివి 2  

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర బొగ్గు, గనుల శాఖ సింగరేణి పరిధిలోని గనులను మరోసారి అమ్మకానికి పెట్టింది. బుధవారం బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారికంగా ఏడో రౌండ్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈసారి దేశంలోని తెలంగాణతో సహా మరో 8 రాష్ట్రాల్లో ఉన్న 106 బొగ్గు బ్లాకులను వేలం వేయనుంది.

ఇందులో సింగరేణికి చెందిన కొత్తగూడెం ఏరియాలోని పెనగడప, మందమర్రి ఏరియాలోని శ్రావణపల్లి బ్లాక్‌ ఉన్నాయి. గతంలో ఈ బ్లాక్‌ను వేలంలో చేర్చగా పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పటివరకు అన్ని రౌండ్లలోనూ సింగరేణి కంపెనీ వేలంలో పాల్గొనకుండా దూరంగా ఉంటూ వస్తోంది. తాజా రౌండ్‌లో పాల్గొంటుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు