తెలంగాణపై తుపాను ఎఫెక్ట్‌.. నేడు, రేపు భారీ వర్షసూచన

4 Dec, 2023 09:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిచౌంగ్‌ తుపాను దూసుకొస్తోంది. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించి.. రేపు మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక, తెలంగాణపై కూడా తుపాను ప్రభావం చూపనుంది. దీంతో.. నేడు, రేపు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 

తుపాన్‌ ప్రభావం ఇలా..

 • తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్న గాలులు 
 • నేడు, రేపు తెలంగాణవ్యాప్తంగా ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో  కూడిన భారీ వర్షాలు
 • ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీచేసిన వాతావరణ శాఖ
 • నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఎల్లో అలెర్ట్ జారీ
 • ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో వీచే అవకాశం

 • కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురు గాలులు
 • రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఆరెంజ్ అలెర్ట్ జారీ
 • నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ , హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ  భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మీల వేగంతో వీచే అవకాశం 
 • మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం 
 • దీంతో తెలంగాణవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగే అవకాశం
 • ఉదయం వేళల్లో దట్టమైన పొగ మంచు ఉండే అవకాశం ఉంది. 

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

>
మరిన్ని వార్తలు