తుఫ్రాన్‌లో కూలిపోయిన శిక్షణ విమానం.. పైలట్‌ మృతి

4 Dec, 2023 09:37 IST|Sakshi

సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లాలోని తుఫ్రాన్‌లో శిక్షణ విమానం కూలిపోయింది. అయితే, విమానం కూలిపోయిన వెంటన భారీగా మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పైలెట్‌ మృతిచెందినట్టు సమాచారం. 

వివరాల ప్రకారం.. తుఫ్రాన్‌ మున్సిపల్‌ పరిధిలోని టాటా కాఫీ కంపెనీ సమీపంలో ఉన్న గుట్టల మధ్య సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది. కాగా, కూలిన విమానాన్ని దుండిగల్‌ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన శిక్షణ విమానంగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా విమానం కూలిపోవడంతో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 
 

>
మరిన్ని వార్తలు