హైదరాబాద్‌లో మరో బిగ్‌ స్కామ్‌.. పోలీసులకే ఊహించని షాకిచ్చారు!

1 Sep, 2022 15:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. గల్ఫ్‌ దేశాలకు వెళ్లేందుకు వేలిముద్రలు కనిపించకుండా సర్జరీలు చేస్తున్న డాక్టర్‌ సహా సిబ్బందిని పోలీసులు గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. 

ఈ నేరాలపై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఫింగర్‌ ప్రింట్‌ స్కామ్‌ ముఠా గుట్టురట్టు అయ్యింది. గల్ఫ్‌ దేశాలకు వెళ్లేందుకు వేలిముద్రలు రిజక్ట్‌ కావడంతో యువకులు ఆపరేషన్‌ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో శస్త్ర చికిత్స చేస్తున్న డాక్టర్‌, సిబ్బందిని అరెస్ట్‌ చేశాము. కాగా, శ్రీలంకలో మొదటి ఫింగర్‌ ప్రింట్‌ ఆపరేషన్‌ జరిగింది. 

నిందితులపై 420తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాము. ఇది హ్యోమన్‌ స్మగ్లింగ్‌. ఒక్కో సర్జరీకి రూ.25వేలు తీసుకున్నారు. కేరళలో ఆరుగురు, రాజస్థాన్‌లో ఇద్దరు, తెలంగాణలో ఇద్దరికి ఫింగర్‌ ప్రింట్స్‌ ఆపరేషన్‌ జరిగింది. కువైట్‌లో ఉద్యోగాల కోసం ఫింగర్‌ ప్రింట్స్‌ మార్చుకున్నారు. ఫింగర్‌ ప్రింట్స్‌ మార్చుకున్నవాళ్లు కువైట్‌ వెళ్లారు అని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌లో​ ఇంటి వచ్చే కొరియర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి: సీపీ సీవీ ఆనంద్‌

మరిన్ని వార్తలు