సూర్యుడిపై పరిశోధనల్లోనూ ఈసీఐఎల్‌ కీలకపాత్ర

3 Sep, 2023 01:52 IST|Sakshi
ఆదిత్య–ఎల్‌1 శాటిలైట్‌ ప్రయోగానికి ఈసీఐఎల్‌ అందజేసిన యాంటెన్నా

కుషాయిగూడ: చంద్రయాన్‌–3 ప్రయోగానికి డీప్‌స్పేస్‌ నెట్‌వర్క్‌ (డీఎస్‌ఎన్‌) యాంటెన్నాను అందజేసిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎల్రక్టానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌  సూర్యుడిపై పరిశోధనల కోసం చేపట్టిన ఆదిత్య–ఎల్‌1 శాటి­లైట్‌ ప్రయోగానికి అవసరమైన యాంటెన్నాను సైతం ఇస్రోకు అందజేసి మరోమారు సత్తా చాటుకుంది.

శనివారం ప్రయోగించిన ఆదిత్య–ఎల్‌1కు అవసరమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థను ఈ యాంటెన్నా అందిస్తుందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ యాంటెన్నా 18 మీటర్ల విస్తీర్ణంలో ఉంటుందన్నాయి. 15 లక్షల కి.మీ. దూరంలో కక్ష్యలో ఉన్న శాటిలైట్‌కు భూమి నుంచి నిర్థిష్టమైన సమాచారాన్ని చేరవేయడంలో యాంటెన్నా కీలకంగా వ్యవహరిస్తుందని వివరించాయి. బెంగళూరుకు 40 కి.మీ. దూరంలోని బైలాలు గ్రామంలో దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపాయి.

ఎంటీఏఆర్‌ సహకారం...
ఆదిత్య–ఎల్‌1 ప్రయోగం విజయంలో హైదరాబా­ద్‌కు చెందిన ఎంటీఏఆర్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ సైతం కీలక సహకారం అందించిందని సంస్థ ఎండీ పర్వత శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ–సీ57 మిషన్‌లో భాగంగా లాంచింగ్‌ వాహనం కోసం లిక్విడ్‌ ప్రొపల్షన్‌ ఇంజిన్లు, ఎలక్ట్రో–­న్యూమాటిక్‌ మాడ్యూల్స్, ప్రొపల్షన్‌ సిస్టమ్, శాటిలైట్‌ వాల్వ్‌లు, సేఫ్టీ కప్లర్‌లు, లాంచ్‌ వెహికల్‌ యాక్చుయేషన్‌ సిస్టమ్‌ల కోసం బాల్‌ స్క్రూలు, కనెక్టర్‌ అసెంబ్లీలు, యాక్చుయేషన్‌ సిస్టమ్స్‌ హార్డ్‌వేర్, నోస్‌ కోన్‌ వంటి వాటిని సరఫరా చేశామన్నారు.

మరిన్ని వార్తలు