ఎన్నికల తర్వాత కేంద్రంలో బీఆర్‌ఎస్‌ది కీలక పాత్ర: హరీశ్‌రావు

5 Nov, 2023 18:11 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌ : పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని చెప్పారు. ఇందిరాపార్క్‌లో ఆదివారం జరిగిన మాదిగల యుద్ధభేరి సభలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదిగల పై ప్రధాని మోదీకి చిత్తశుద్ది లేదన్నారు. ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్న మోదీ ఎస్సీ వర్గీకరణపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ఏర్పాటయ్యాక అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని హరీశ్‌ చెప్పారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణపై తాత్సారం చేస్తోందన్నారు. మాదిగల పై మోదీకి చిత్తశుద్ది లేదన్నారు. ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్‌ ఎన్నోసార్లు అడిగినా మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్ రాష్ట్రంలో 33 దళితస్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఎస్సీల్లో అర్హులకు రూ.10లక్షలిచ్చి సాయం చేయాలనే ఉద్దేశంతోనే దళితబంధు ప్రారంభించినట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు