ప్రభుత్వ డబ్బులతో కేసీఆర్‌ పార్టీ ప్రచారం: ఈటల

17 Aug, 2021 00:43 IST|Sakshi

చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసులు మూల్యం చెల్లించక తప్పదు

ఇల్లందకుంట(హుజూరాబాద్‌): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ డబ్బులతో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారం చేస్తున్నారని..దీనిని ప్రజలు హర్షించరని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ఆరోపించారు. వేలమంది అరెస్ట్‌లతో హుజూరాబాద్‌ భయం గుప్పిట్లో ఉందని ఆరోపించారు. వాసాల మర్రిలో ఇప్పటికే ప్రారంభించిన దళిత బంధు పథకానికి ఇంత ఆర్భాటాలు ఎందుకని సోమవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందే షరతులు లే కుండా ప్రతీ దళిత కుటుం బానికి రూ.10 లక్షలు ఇ వ్వాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలోని ప్రజ లు స్పందించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు పెట్టి తరలించారని ఆరోపించారు. మీటిం గ్‌కు తరలించే బాధ్యత టీచర్లు, అంగన్‌వాడీలు, ఆశ వర్కర్స్, రెవెన్యూ సిబ్బందికి అప్పగించారని, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈటల హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు