ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటి ముందు పసుపు కొమ్ములు పోసి..

9 May, 2022 01:29 IST|Sakshi
ఎంపీ అర్వింద్‌ నివాసం ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు 

పెర్కిట్‌ (ఆర్మూర్‌): ఎంపీగా గెలిచిన వెంటనే పసుపు బోర్డు తీసుకొస్తానని బాండు పేపరు రాసిచ్చి మోసం చేసిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తన పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలోని చేపూర్, మాక్లూర్‌ మండలం రాం చంద్రపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఆదివారం పెర్కిట్‌లోని ఎంపీ నివాసం ఎదుట పసు పు కొమ్ములు పోసి ఆందోళనకు దిగారు.

పోలీసులు ఎంపీ నివాసానికి చేరుకుని రైతులను అక్కడి నుంచి పంపించారు. కాగా, రైతుల ముసుగులో దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌ గుండాలపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అక్కడికి చేరుకున్న బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

మరిన్ని వార్తలు