హైదరాబాద్‌లో ఫింగర్‌ ప్రింట్‌ సర్జరీ ముఠా గుట్టురట్టు

1 Sep, 2022 11:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. నగరంలో ఫింగర్‌ ప్రింట్‌ సర్జరీ ముఠాను రాచకొండ పోలీసులు గుట్టురట్టు చేశారు. గల్ఫ్‌ దేశాలకు వెళ్లేందుకు కొత్త తరహాలో ఈ ముఠా ప్రయత్నాలు చేస్తోంది. గల్ఫ్‌ దేశాలకు వెళ్లాలంటే వేలిముద్రలు తప్పనిసరి. అయితే ఒకసారి రిజక్ట్‌ అయిన యువకులు సర్జరీలతో మళ్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సంవత్సరం పాటు వేలిముద్రలు కనిపించకుండా ఉండేలా కొత్త రకం సర్జరీ చేస్తున్నట్లు సమాచారం. సర్జరీ తర్వాత దొడ్డిదారిన గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. యువకులకు వేలిముద్రల సర్జరీ చేస్తున్న డాక్టర్‌తో పాటు కొంత మంది సిబ్బందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

చదవండి: (అనంతపురం ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అట్రాసిటీ కేసు నమోదు)

మరిన్ని వార్తలు