Hyd Ankura Hospital Fire Accident: మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం

23 Dec, 2023 20:21 IST|Sakshi

Updates

► బిల్డింగ్ ఐదో అంతస్తులో హాస్పిటల్‌లో పనిచేసే నర్సులు హాస్టల్ ఉందని మంటలు అంటుకోవడంతో హుటాహుటిన కిందికి వచ్చేసామని సుమారు 100 మంది నర్సుల సర్టిఫికెట్స్ కూడా పైనే వదిలేసి వచ్చామని నర్సులు విలపిస్తున్నారు.
► షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా ఆస్పత్రి టెరస్‌ ఔట్‌ లైట్లకు మంటలు అంటుకున్నాయి: అంకుర ఆస్పత్రి యాజమన్యం 
► అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటను అదుపు చేశారు. 

►  రోగులెవరికీ ఏ ప్రమాదం జరగలేదని ఆస్పత్రి అధికారుల వెల్లడి
► సకాలంలో మంటలను ఫైర్‌ సిబ్బంది  అదుపు చేయడంతో పెను ముప్పు తప్పింది. 
► క్షేమంగా బయటపడ్డ ఆస్పత్రిలోని రోగులు
► ఫైర్‌ సిబ్బంది స్థానికులు సహకరించారు.   

►  పదో అంతస్తులో ప్లాస్టిక్‌ మెటీరియల్‌ అధికంగా ఉండటం వల్ల భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 
► ఆస్పత్రి నేమ్‌ బోర్డుకు మంటలు అంటుకొని వ్యాపించాయి. పక్కనే ఉన్న ఫ్లెక్సీకి మంటలు అంటుకోవడంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
► షార్ట్‌ సర్క్యూట్‌ వల్లనే మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది.


► మంటలను గమనించి రోగులను ఆస్పత్రి సిబ్బంది బయటకు పంపించారు. 
► ఆస్పత్రితో  గర్భిణీలు, పిల్లలు ఎక్కువ శాతం ఉన్నట్లు తెలుస్తోంది.

►ఐదు అంతస్తుల్లో మంటలు విస్తరించాయి. ఘటనా స్థలానికి నాలుగు ఫైర్‌ ఇంజన్లు చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. ఐదో ఫ్లోర్‌ నుంచి పదో ఫ్లోర్‌ వరకు మంటలు వ్యాపించాయి. 

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంకుర ఆస్పత్రితో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఆగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.    

>
మరిన్ని వార్తలు