నయీం కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి

14 Dec, 2020 16:42 IST|Sakshi

నయీం కేసును సీబీఐకి అప్పగించాలి

గవర్నర్‌కు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి కోరారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నయీం ఇంట్లో 24 వెపన్స్‌, ఏకే 47 రైఫిల్స్‌, పిస్టర్స్‌, గ్రనేడ్స్‌ పట్టుబడ్డాయని, పోలీసుల సహకారం లేకుండా అత్యాధునిక ఆయుధాలు నయీంకు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. (చదవండి: ‘తెలంగాణలో నయా రాచరికం’)

‘‘నయీం ఇంట్లో దొరికిన 24 గన్స్‌కు లైసెన్స్‌ ఇచ్చింది పోలీసులే. నయీం ఇంట్లో బుల్లెట్ ప్రూఫ్‌ జాకెట్లు దొరికాయంటే పోలీసులకు సంబంధం లేదని సిట్ ఎలా చెబుతుంది. పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది కూడా నయీంకు సహకరించారు. నయీం ఇంట్లో 752 ల్యాండ్ డాక్యుమెంట్లు దొరికాయి. నయీం కేసును సీబీఐకి అప్పగించాలి. నయీం ఇంట్లో దొరికిన 602 సెల్‌ఫోన్ల కాల్ డేటాను ఎందుకు బయట పెట్టడం లేదని’’ ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రశ్నించింది. నయీం లాంటి దుర్మార్గులు మళ్ళీ మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే సహకరించిన పోలీసులపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సిందేనని,  దీని పై గవర్నర్ కు లేఖ రాశామని పద్మనాభరెడ్డి  తెలిపారు. (చదవండి: టీపీసీసీ చీఫ్‌ ఎంపిక మరింత ఆలస్యం!)

మరిన్ని వార్తలు