వరంగల్‌ వరద ముంపు విముక్తికి తెలంగాణ సర్కార్‌ చర్యలు

16 Aug, 2023 13:57 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: గ్రేటర్‌ వరంగల్‌ వరద ముంపు విముక్తికి తెలంగాణ సర్కార్‌ చర్యలు చేపట్టింది. నాలాల కబ్జా, అక్రమ నిర్మాణాల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. నష్ట నివారణకై మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు నాలాల చుట్టూ ఉన్న నిర్మాణాల తొలగింపుకు మార్కింగ్ ఇచ్చి కూల్చివేత పనుల్లో నిమగ్నమయ్యారు.

నయీమ్ నగర్ నాలా నుంచి కూల్చివేత పనులు ప్రారంభించారు.  అయితే నాలాలను ఆనుకుని నిర్మాణాలు చేపట్టిన వారు ఆక్రమణల తొలగింపు చర్యలను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీస్ బందోబస్తు మధ్య నాలాల కబ్జా తొలగింపు పనులను అధికారులు చేపట్టారు.

ఇటీవల కురిసిన కుంభవృష్టికి ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. కాలనీలు చెరువులు, కుంటలను తలపించగా, వీధులు వాగులుగా మారాయి. వరంగల్‌లో భారీ వర్షంతో వరదలు పోటెత్తి పలు కాలనీలు జలమయం కావడంతో అపార నష్టం సంభవించిన విషయం తెలిసిందే.
చదవండి: కేసీఆర్‌ మెదక్‌ పర్యటన వాయిదా.. కారణం ఇదే..

మరిన్ని వార్తలు