హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. కొట్టుకొచ్చిన మృతదేహం.. వీడియోలు

20 Sep, 2021 19:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో పలు చోట్ల సోమవారం భారీ వర్షం కురిసింది. సైదాబాద్ కృష్ణా నగర్‌లో వరద నీటిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, రామ్‌నగర్‌, కవాడీగూడ, దోమలగూడలో వర్షం పడింది. విద్యానగర్‌, అడిక్‌మెట్‌, బోయిన్‌పల్లి, చిలకలగూడ, మారేడ్‌పల్లి, బేగంపేట, ప్యాట్నీ సెంటర్‌, ప్యారడైస్‌, ఆల్వాల్‌లో భారీ వర్షం కురిసింది.
(చదవండి: తెలంగాణలో 172 జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ పోస్టులు


 

దీంతో పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపునీరు చేరింది. వాహనదారులను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది.


 


 

వర్షం కారణంగా పలు కూడళ్లలో ట్రాఫిక్‌ స్తంభించింది. నగర వాసులు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని నగరవాసులకు వాతావరణ శాఖ సూచించింది.


పాతబస్తీలో పలు చోట్ల కాలనీలు నీటమునిగాయి. జూపార్క్‌ ప్రాంతంలో 9.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. దూద్‌బౌలిలో 7.7 సెం.మీ, చార్మినార్‌లో 5.8 సెం.మీ, అత్తాపూర్‌లో 5.1 సెం.మీ, రెయిన్‌బజార్‌లో 5 సెం.మీ వర్షపాతం నమోదైంది.
 


చదవండి:
ఛీ ఛీ.. నాలుకతో ఎంగిలి చేస్తూ, కాళ్లతో తొక్కుతూ.. 

మరిన్ని వార్తలు