సిద్దిపేట జిల్లాలో ఘోరం.. ఎలక్ట్రిక్‌ వాహనం పేలి ఇల్లు దగ్దం

8 Jun, 2022 08:26 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట: తెలంగాణలో వరుసగా ఎలక్ట్రిక్‌ వాహనాలు, బ్యాటరీల పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పేలుళ్ల కారణంగా వెహికిల్స్‌ కాలిపోవడమే కాకుండా వ్యక్తులు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ ఘటనలు పెట్రోల్‌ ధరలు మండిపోతుండటంతో ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేయాలనుకున్న వారిలో వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా సిద్ధిపేట జిల్లాలో చార్జింగ్‌పెట్టిన ఓ ఎలక్ట్రిక్‌ వాహనంలో బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోయినా ఇల్లు పూర్తిగా దగ్దమైంది.

దుబ్బాక మండలం పెద్దచీకోడు గ్రామంలో పుట్ట లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి మంగళవారం రాత్రి తన ఎలక్ట్రిక్‌ వాహనాన్ని ఇంటి ముందు చార్జింగ్‌లో పెట్టాడు. అయితే అనూహ్యంగా బైక్‌ బ్యాటరీ పేలడంతో ఇల్లు పూర్తి కాలి దగ్దమైంది. 

చదవండి: ట్యాంక్‌బండ్‌పై నిర్లక్ష్యంగా బండి పెడితే రూ. 1000 పడుద్ది!

మరిన్ని వార్తలు