జూరాల, శ్రీశైలానికి భారీ ప్రవాహాలు

19 Jul, 2021 02:37 IST|Sakshi
జూరాల నుంచి దిగువకు విడుదలవుతున్న నీరు

సాక్షి, హైదరాబాద్‌: గత నాలుగు రోజులుగా ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ల పరిధిలో కొనసాగుతున్న వర్షాలకు తోడు స్థానిక పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి పోటెత్తుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి 52 వేల క్యూసెక్కులను దిగువనున్న నారాయణపూర్‌కు విడుదల చేస్తుండగా అక్కడి నుంచి 62 వేల క్యూసెక్కులను నదిలోకి వదిలేస్తున్నారు. దీంతో ఆదివారం సాయంత్రానికి జూరాలకు 79 వేల క్యూసెక్కులు వస్తుండగా లక్ష క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.

ఈ నీరంతా శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలానికి 99 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తుండటంతో అక్కడ నీటి నిల్వ 215 టీఎంసీలకుగాను 41.11 టీఎంసీలకు చేరింది. ఇక ఇక్కడి నుంచి 7 వేల క్యూసెక్కులను వదిలేస్తుండటంతో నాగార్జునసాగర్‌లోకి 9 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో అక్కడ పూర్తి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకుగాను ప్రస్తుతం నిల్వ 169.71 టీఎంసీలకు చేరింది. మరోవైపు గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు తగ్గుముఖం పట్టాయి.

మరిన్ని వార్తలు