గణేష్‌ నిమజ్జనం.. మెట్రో సేవల సమయం పొడిగింపు..

27 Sep, 2023 20:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా(జంట నగరాల్లో) ఘనంగా గణేష్‌ నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. అయితే, రేపు(గురువారం) ఖైరతాబాద్‌ మహా గణపతి, బాలాపూర్‌ నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన చేసింది. మెట్రో సేవల సమయాన్ని పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. 

వివరాల ప్రకారం.. గణేష్‌ నిమజ్జనం సందర్బంగా మెట్రో సమయాల్లో మార్పులు చేశారు. ప్రయాణీకులకు గురువారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు మెట్రో ట్రైన్ సేవలు అందుబాటులో ఉండనున్నట్టు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. అలాగే, మెట్రో సర్వీలసులను కూడా పెంచినట్టు ఆయన తెలిపారు. శుక్రవారం రాత్రి ఒంటి గంటకు అన్ని స్టేషన్ల నుంచి చివరి సర్వీస్‌ బయలుదేరి అర్థరాత్రి 2 గంటలకు చివరి స్టేషన్లకు చేరుకుంటాయని వెల్లడించారు. 

మరోవైపు.. హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వాన కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇక, హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా గణనాథుల నిమజ్జనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు