నాంపల్లి ఎగ్జిబిషన్‌ పునః ప్రారంభం.. ట్రాఫిక్‌ ఆంక్షలు

25 Feb, 2022 15:24 IST|Sakshi

ఫిబ్రవరి 25 నుంచి మార్చి 31 వరకు అమలు 

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో శుక్రవారం నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన పునః ప్రారంభమైంది. దీనికి వచ్చే సందర్శకుల తాకిడి నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఇవి అమలులో ఉంటాయి. 

ఎస్‌ఏ బజార్, జామ్‌బాగ్‌ల వైపు నుంచి ఎంజే మార్కెట్‌ మీదుగా నాంపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ బస్సులు, భారీ వాహనాలను ఎంజే మార్కెట్‌ నుంచి అబిడ్స్‌ మీదుగా మళ్లిస్తారు. పోలీసు కంట్రోల్‌ రూమ్, ఫతేమైదాన్‌ వైపు నుంచి నాంపల్లి, ఎంజే మార్కెట్‌ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ బస్సులు, భారీ వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ నుంచి బీజేఆర్‌ స్టాట్యూ వైపు పంపిస్తారు. (క్లిక్‌: పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. ‘గాంధీ’లో గిదేందీ!

బేగంబజార్‌ ఛత్రి వైపు నుంచి మాలకుంట వైపు వెళ్లే భారీ సరుకు రవాణా వాహనాలను అలాస్కా జంక్షన్‌ నుంచి దారుస్సలాం మీదుగా పంపిస్తారు. దారుస్సలాం నుంచి వచ్చే భారీ వాహనాలు, డీసీఎంలు అలాస్కా వద్ద కుడివైపు తిరిగి ఫీల్‌ఖానా, బేగంబజార్‌ ఠాణా మీదుగా ఎంజే మార్కెట్, అబిడ్స్‌ చేరుకోవాలి. (క్లిక్‌: రూ. 99 వేల కోట్ల..నిజాం నగలున్నాయి)

మరిన్ని వార్తలు