హైదరాబాద్‌ ప్రజలకు ముఖ్యగమనిక.. ఆగమాగం బయటకు రావొద్దంటూ..

22 Jul, 2022 13:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగర ప్రజలకు కీలక సూచన చేశారు ట్రాఫిక్‌ పోలీసులు. నగరంతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల ఇవాళ ఉదయం నుంచి వాన దంచికొడుతోంది. ఆగి ఆగి కొడుతున్న వానతో జనం ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇయ్యాల(శుక్రవారం), రేపు(శనివారం) భారీ వర్షాలు ఉంటాయని చెప్పింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతోంది జీహెచ్‌ఎంసీ.  

అలాగే వర్షం తెరిపి ఇ‍వ్వగానే ఆగమాగం బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగం. కొద్ది సమయం తర్వాతే బయటకు రావాలని.. అప్పుడే ట్రాఫిక్‌ సమస్యల నుంచి బయటపడొచ్చని తెలిపారు. 

భారీ వర్షాలతో నగరం రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉంది. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవచ్చు కూడా. అందుకే నిమ్మలంగా బయటకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు. అలాగే.. విద్యార్థులు, వ్యాపారాలు చేసుకునేవాళ్లు, ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో పలు జిల్లాలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.

మరిన్ని వార్తలు