వాసాలమర్రి బిడ్డ సుప్రజను డాక్టర్‌ చదివిస్తా..: సీఎం కేసీఆర్‌

23 Jun, 2021 02:25 IST|Sakshi
సహపంక్తి భోజనంలో సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతున్న విద్యార్థిని సుప్రజ

సాక్షి, యాదాద్రి: వాసాలమర్రి సభలో సీఎం కేసీఆర్‌ మరో హామీ ఇచ్చారు. ఆ గ్రామానికి చెందిన బాలికను ఎంబీబీఎస్‌ చదివిస్తానని ప్రకటించారు. వాసాలమర్రికి చెందిన నర్సింహులు, రాణి దంపతుల కూతురు సుప్రజను విషయమై సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘సహపంక్తి భోజనం చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. ఊరిలోని ప్రభుత్వ బడిలో పదో తరగతి పాసయ్యానని, డాక్టర్‌ కావాలని ఉందని చెప్పింది. అంత చదివించే స్తోమత ఆ కుటుంబానికి లేదు. అమ్మాయి తండ్రి తమకు అర ఎకరం మాత్రమే పొలం ఉందని, తల్లి హైదరాబాద్‌లో సేల్స్‌ ఉమన్‌గా పనిచేస్తుందని చెప్పారు. చదువుకునేందుకు ప్రభుత్వ స్కీంలు ఉన్నాయి. కొందరికి తెలియదు. అయినా ఆమెను నేను చదివిస్తా. ఊర్లో ఇంకా ఇలాంటి వారు ఎందరున్నా వారందరినీ చదివించాలి’’ అని కేసీఆర్‌ సూచించారు.

>
మరిన్ని వార్తలు