26న ఈశాన్య రుతుపవనాల ప్రవేశం

22 Oct, 2021 03:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 26న దేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ఉపసంహరణ కొనసాగుతోందని, ఇప్పటికే దక్షిణ భారత దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల నుంచి ‘నైరుతి’వెనక్కు వెళ్లిందని తెలిపింది. కాగా రాష్ట్రానికి ఉత్తర, వాయవ్య దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పొడివాతావరణమే ఉంటుందని, వర్షాలకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.   

మరిన్ని వార్తలు