ప్రాణాలకు తెగించి.. పేసర్‌ బిగించి.. 

30 Mar, 2021 00:24 IST|Sakshi

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఈ ఫొటో చూస్తే ఎలాంటి ఆధారం లేని నిచ్చెనను కింద ముగ్గురు పట్టుకోగా.. పైకి వెళ్లిన ఓ వ్యక్తి విద్యుత్‌ లైన్‌పై పనిచేస్తుండటం సర్కస్‌ ఫీట్‌లా అనిపిస్తోంది కదా! కానీ ఇలాంటి ప్రాణాంతక విన్యాసాలు తమ విధి నిర్వహణలో మామూలేనని విద్యుత్‌ సిబ్బంది చెబుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని బస్టాండ్‌ వెనుక వైపు ప్రాంతంలో ఎస్‌ఎస్‌ 86 (100 కేవీ) విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద లైన్‌లో సోమవారం పేసర్లు బిగించాల్సి వచ్చింది.

అయితే, లైన్‌ వద్దకు వెళ్లి నిలబడి పనిచేసేందుకు ఎలాంటి ఆధారం లేకపోవడంతో 12 ఫీట్ల నిచ్చెనను నిటారుగా నిలబెట్టి కింద ముగ్గురు సిబ్బంది పట్టుకున్నారు. ఆ తర్వాత కుమార్‌ అనే విద్యుత్‌ కార్మికుడు పైకి ఎక్కి పేసర్లు బిగించాడు. 

మరిన్ని వార్తలు