హైదరాబాద్‌ వేదికగా ఆపరేషన్‌ జార్ఖండ్‌.. టీపీసీసీ భారీ ప్లాన్‌!

2 Feb, 2024 13:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జార్ఖండ్‌ రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. హైదరాబాద్‌ వేదికగా ఆపరేషన్‌ జార్ఖండ్‌ రాజకీయం నడుస్తోంది. ఆపరేషన్‌ జార్ఖండ్‌ బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌ కుమార్‌కు టీపీసీసీ అప్పగించింది. 

ఇందులో భాగంగా జార్ఖండ్‌ కాంగ్రెస్‌, జేఎంఎం ఎమ్మెల్యేలు నేడు హైదరాబాద్‌కు రానున్నారు. జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు బేగంపేట్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ వారి కోసం మూడు హోటల్స్‌ను సిద్ధం చేసింది. గచ్చిబౌలి, రామోజీ ఫిల్మ్‌ సిటీ, శామీర్‌పేట్‌ లియోనియో హోటల్స్‌ను టీపీసీసీ బుక్‌ చేసింది. ఈ క్రమంలో 43 మంది ఎమ్మెల్యేలను హోటల్స్‌కు తరలించేందుకు బస్సులను కూడా సిద్ధం చేశారు. కాగా, జార్ఖండ్‌లో బలపరీక్ష నిరూపణ వరకు ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. 

మరోవైపు.. కొద్దిసేపటి క్రితమే జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా చంపయ్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. మనీలాండరింగ్‌ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

whatsapp channel

మరిన్ని వార్తలు