తిరుమలగిరిలో హైటెన్షన్... కరెంటు స్తంభం ఎక్కిన స్థానికులు

30 Dec, 2021 12:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తిరుమలగిరి పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేఎన్ఎన్​యూఆర్ఎం పథకంలో ఇళ్లను స్థానిక నేతలు అమ్ముకున్నారని స్థానికులు ఎల్‌ఐసీ బిల్డింగ్‌ వద్ద  ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొందరు హైటెన్షన్‌ స్తంభాన్ని ఎక్కి నిరసన తెలిపారు. వెంటనే అర్హులైన తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.

వీరిలో లక్ష్మణ్‌, రాములమ్మ, రాజు, మహేష్‌, శంకరమ్మ స్తంభం​ ఎక్కినట్లు గుర్తించారు. వీరంతా స్థానిక ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తమకు కేటాయించిన స్థలాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు హమీ ఇవ్వడంతో స్తంభం నుంచి కిందకు దిగివచ్చారు. 

చదవండి: వివాహితకు మరో వ్యక్తితో పరిచయం.. ఏడాదిగా సహజీవనం

మరిన్ని వార్తలు