పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో అతిపెద్ద బ్యాలెట్‌!

3 Mar, 2021 08:19 IST|Sakshi

ముంబైలో బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణ

పెద్దసైజు బ్యాలెట్‌ బాక్సుల తయారీ

వేగంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియ

సాక్షి నల్లగొండ : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ వేగమంతమైంది. ఈసారి బరిలో 71 మంది అభ్యర్థులు ఉండడంతో భారీ బ్యాలెట్‌ పేపర్‌ సిద్ధమవుతోంది. నమూనా బ్యాలెట్‌ తయారు చేసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాష్ట్ర ఎన్నికల అధికారికి పంపించగా దానిని ఫైనల్‌ చేశారు. బ్యాలెట్‌ ముద్రణకు ముంబైకి పంపారు. పెద్ద బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్‌కు సంబంధించి ఓటర్‌ స్లిప్‌లను మండలాలవారీగా పంపిణీ చేశారు. 

వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో 12 కొత్త జిల్లాలు ఉన్నాయి. వాటి పరిధిలో మొత్తం 5,05,565మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. మొత్తం 731 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరి 16 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 23న ముగిసిన విషయం తెలిసిందే. 26న ఉçపసంహరణ కార్యక్రమం ముగిసే నాటికి 71 మంది అభ్యర్థులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నెల 14న పోలింగ్, 17న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

అతిపెద్ద బ్యాలెట్‌
71మంది పోటీదారులు ఉండడంతో పెద్ద బ్యాలెట్‌ సిద్ధం చేస్తున్నారు. 18్ఠ23 ఇంచుల బ్యాలెట్‌ పేపర్‌ ను ముద్రిస్తున్నారు. నాలుగు కాలాలుగా బ్యాలెట్‌ ను విభజిస్తున్నారు. ఒక్కో కాలానికి 20 మంది చొ ప్పున అభ్యర్థులు ఉంటారు. ఓటు వేసిన అనంత రం కాలం వారీగా బ్యాలెట్‌ పేపర్‌ను ఫోల్డ్‌ చేసేలా ముద్రిస్తున్నారు. బ్యాలెట్‌ పేపర్‌ను ప్రభుత్వ సంస్థలోనే ముద్రించాలన్న ఉద్దేశంతో ముంబయికి పంపించారు. రెండు రోజుల్లో ముద్రణ పూర్తికానుంది. 

జంబో బ్యాలెట్‌ బాక్సులు..
బ్యాలెట్‌ పేపర్‌ బారీ ఎత్తున ఉండడంతో దానికి అనుగుణంగా ఎన్నికల అధికారులు జంబో బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. 2్ఠ2్ఠ21/2 సైజులో బాక్సు ఉండేలా చూస్తున్నారు. మొత్తం 12 జిల్లాల పరిధిలో 731 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా ఒక్కో కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్‌ బాక్సుçతోపాటు మరో బిగ్‌ సైజ్‌ బ్యాలెట్‌ బాక్సు ఇవ్వనున్నారు. ఆ దిశగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారులు, సిబ్బందికి మొదటి విడత శిక్షణ కూడా ఇచ్చారు.   

మరిన్ని వార్తలు