తెలంగాణ హైకోర్టు సీజేగా హిమ కోహ్లీ

15 Dec, 2020 16:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమ కోహ్లీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న ఆమె పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్‌ చౌహన్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ చేయనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. కాగా, నూతన న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం సోమవారం సిఫార్సు చేసింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా హిమ కోహ్లీ నియమితులయ్యారు. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మురళిధర్ నియమితులయ్యారు. ప్రస్తుతం హిమ కోహ్లీ ఢిల్లీ హైకోర్టులో జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించారు. 1979 లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఆనర్స్ హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ లా సెంటర్‌లో ‘లా’ పూర్తి చేశారు. (చదవండి: ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోం)

మరిన్ని వార్తలు