అప్పు తీర్చలేక బాలిక అప్పగింత

19 Oct, 2020 14:24 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, ఖమ్మం ‌: రూరల్‌ మండలంలోని పల్లెగూడెం గ్రామానికి చెందిన బాలిక అత్యాచారయత్నం ఆపై హత్యాయత్నానికి గురై హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే బాలిక మృతికి సంబంధించి మరో ఆసక్తికరమైన ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి మొదట తల్లిదండ్రులు ఓ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. సదరు బాలిక తల్లిదండ్రులు పల్లెగూడెంలోని ఓ వ్యక్తి వద్ద కొంత నగదును అప్పుగా తీసుకున్నారు. తీర్చడానికి ఇబ్బందులు పడుతుండటంతో అప్పు ఇచ్చిన వ్యక్తి అల్లం సుబ్బారావు ఇంట్లో పనిమనిషిగా కుదిర్చాడు ఖమ్మం ముస్తఫానగర్‌లోని ఓ ఇంట్లో పనికి కుదిర్చాడు. ఈ క్రమంలోనే బాలిక ఆ ఇంటి యజమాని కుమారుడి చేతిలో అత్యాచారయత్నానికి, ఆపై హత్యాయత్నానికి గురై మృతిచెందింది. (లైంగిక దాడి బాధితురాలి మృతి)

తమ కూతురు మృతికి అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా కారణమేనని బాలిక తల్లిదండ్రులు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. అయితే మరికొందరి వాదన ప్రకారం.. అప్పు తీర్చలేని క్రమంలోనే ఆ వ్యక్తి బలవంతంగా బాలికను ఇంట్లో బందించి పని చేయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై రూరల్‌ సీఐ సత్యనారాయణరెడ్డిని సాక్షి వివరణ కోరగా.. ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని, దీనిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కాగా బాలిక కుటంబు సభ్యులను పరామర్శించిన మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌.. ప్రభుత్వం తరఫున రెండు లక్షల సాయం అంధించారు. దోషులపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. (ఆ ఘటన మా కుటుంబానికి తీరని లోటు)

గత నెల 18న రాత్రి బాలిక పని ముగించుకుని నిద్రిస్తుండగా, సుబ్బారావు కుమారుడు మారయ్య అత్యాచారానికి యత్నించాడు. విషయం బయట పడుతుందని భావించి.. బాలికపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. మంటల ధాటికి ఆమె కేకలు వేయడంతో పైన నిద్రిస్తున్న నిందితుడి తండ్రి సుబ్బారావు కిందకు చేరుకుని మంటలను ఆర్పివేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ముందుగా ఖమ్మం, అనంతరం హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు