మహిళల మీద రేప్‌ కేసు?

3 Dec, 2023 05:54 IST|Sakshi

సాధ్యాసాధ్యాల పరిశీలనకు సుప్రీంకోర్టు అంగీకారం

న్యూఢిల్లీ: అత్యాచార సంఘటనల్లో మహిళలే బాధితులుగా ఉంటారు. మరి వారి మీద రేప్‌ కేసు పెట్టొచ్చా? దీనిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రేప్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం ఒక 61 ఏళ్ల మహిళ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సదరు మహిళపై కోడలు రేప్‌ కేసు పెట్టింది.

కేసును  జస్టిస్‌ హృషికేశ్, జస్టిస్‌ సంజయ్‌ల ధర్మాసనం విచారించింది. చట్టప్రకారం మహిళలపై ఇలా రేప్‌ కేసు పెట్టలేరని ఆమె తరఫు న్యాయవాది గుర్తు చేశారు. ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువర్చిందని గుర్తుచేశారు. దీంతో పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందన తెలిపాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు