అధికారంలో ఉండి దత్తత ఎందుకు

22 Oct, 2022 09:22 IST|Sakshi

నల్గొండ: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మునుగోడును మంత్రి కేటీఆర్‌ దత్తత తీసుకుంటాననడం ఏంటని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి ప్రశ్నించారు. శుక్రవారం మండలంలోని శివన్నగూడ, యరగండ్లపల్లితోపాటు పలు గ్రామాల్లో ఆమె ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దత్తత పేరిట కేసీఆర్‌ అనేకమార్లు మోసం చేశారని అన్నారు. 

శివన్నగూడ రిజర్వాయర్‌ నిర్వాసితులకు పరిహారం అందించడానికి మనసొప్పదు కానీ, ఉప ఎన్నికలో లక్షల కోట్ల ప్రజాధనాన్ని అధికార పార్టీ ఖర్చు చేస్తోందని ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డిని ఓడించడానికి 84 మంది ఎమ్మెల్యేలు, 12 మంది మంత్రులు, 16 మంది ఎమ్మెల్సీలు మునుగోడులో మకాం వేశారని, సీఎం కేసీఆర్‌ సైతం లెంకలపల్లి గ్రామానికి ఇన్‌చార్‌్జగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. 

మునుగోడు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన రాజగోపాల్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతోనే మునుగోడులో ఆగిన పనులు ప్రారంభిస్తున్నారని అన్నారు. రాజగోపాల్‌రెడ్డిపై విశ్వాసం ఉంచి మునుగోడు ఉప ఎన్నికలోగెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చిట్యాల సబితాయాదగిరిరెడ్డి, మెండు దీపికాప్రవీణ్‌రెడ్డి, కొడాల రాజ్యలక్ష్మీవెంకట్‌రెడ్డి, జమ్ముల వెంకటేష్‌గౌడ్, రాజేందర్‌నాయక్, ఎలిమినేటి సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓడిపోతామనే భయంతో దుష్ప్రచారాలు

బీజేపీ విస్తృత ప్రచారం 
మండలంలోని రాంరెడ్డిపల్లిలో బీజేపీ నాయకులు శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కోఇన్‌చార్జ్‌ బొడిగ నాగరాజు మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వెన్నమనేని శోభారవీందర్‌రావు, మాజీ ఎంపీపీ పాముల యాదయ్య, మండల కార్యదర్శి పగిళ్ల లింగస్వామి, మాజీ సర్పంచ్‌ నక్క వెంకటయ్య, మోర వెంకటయ్య, నక్క బుగ్గరాములు, వడ్డె ముత్యాలు, కావలి గద్దర్, వడ్డె శంకరయ్య, లపంగి దేవేందర్, వడ్డె సైదులు, రాములు, కొండా దేవేందర్, రాజు, వెంకటయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

చండూరు : మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతున్నామనే భయంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తమపై దుష్ప్రచారాలు చేస్తున్నారని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు కొండ విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. తుల ఉమాతో కలిసి శుక్రవారం చండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి గెలుపు కోరుతూ మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో తాము ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో.. తమపై పార్టీ మారుతున్నారని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రచారం చేయడం సరికాదన్నారు. బీజేపీ గెలుపు ఖాయమైందని అనేక సర్వేలు చెబుతుండడంతో టీఆర్‌ఎస్‌లో వణుకు మొదలైందన్నారు. ఓటమి చెందుతున్నామనే సంకేతం రావడంతో ముఖ్యమంత్రి కొడుకు స్వయంగా బీజేపీ నాయకులకు ఫోన్లు చేస్తున్నారని అన్నారు. నలుగురు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ మంత్రులు, మరో ఇద్దరు ప్రస్తుత మంత్రులు బీజేపీలోకి రానున్నారని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు