రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత

3 Nov, 2023 03:07 IST|Sakshi

రైలు ప్రమాదంలో మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు

మాడుగుల రూరల్‌: ఇటీవల విజయనగరం జిల్లా కంటకాపల్లి సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళ కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయు­డు గురువారం అందజేశారు.

ప్రమాదంలో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన ముర్రు లక్ష్మి (52) ఆదివారం రాత్రి రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం పరామర్శించి రూ.10 లక్షల చెక్కును అందజేశారు.

మరిన్ని వార్తలు