కరోనా రోగికి అత్యవసర చికిత్స

17 Aug, 2020 03:13 IST|Sakshi

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ చొరవ 

ట్విట్టర్‌లో అభినందించిన మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, జగిత్యాల: ప్రమాదవశాత్తు గాయపడి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న కరోనా బా ధితుడికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ చొరవ తీసుకొని వైద్యం అందించారు. జ గిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని అంతర్గాం గ్రామానికి చెందిన ఓ గీత కార్మికుడు ఇటీవల ఇంట్లో జారిపడ్డాడు. తల కు బలమైన గాయంతోపాటు కుడికాలు విరిగిం ది. కన్నుకు కూడా తీవ్ర గాయమైంది. చికిత్స కోసం కరీంనగర్‌లోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిన క్రమంలో అతను కరోనా బారిన పడ్డాడు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో అక్కడి వైద్యులు చికిత్సకు నిరాకరించారు. ఈ క్రమంలో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ తీవ్రమైన నొప్పితో నరకయాతన అనుభవిస్తున్నాడు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ వెంటనే స్పందించారు. నేత్రవైద్యుడు అయిన ఎమ్మెల్యే సంజయ్‌తోపాటు ఆర్ధోపెడిక్‌ వైద్యుడు నవీన్, వైద్యసిబ్బంది పీపీఈ సూట్‌లు ధరించి కరోనా బాధితుడికి ఆదివారం చికిత్స అందించారు. ఇది తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌.. ఎమ్మెల్యే సంజయ్‌ను ట్విట్టర్‌లో అభినందించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు