ఏపీ పోలీసులపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు

1 Dec, 2023 13:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. నాగార్జున సాగర్‌ విజయపురి టౌన్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. ఏ1గా ఏపీ పోలీస్‌ ఫోర్స్‌ను పేర్కొంటూ కేసు నమోదు చేశారు. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకొచ్చారని తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ ఫిర్యాదు చేసింది.

ప్రధాన డ్యామ్‌లోని 13 నుంచి 26 గేట్ల వరకు ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. కుడి కాల్వ 5వ గేటు నుంచి ఏపీకి వదిలారని ఫిర్యాదులో తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ పేర్కొంది. 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
చదవండి: సాగర్‌పై ఏపీ చర్యలు న్యాయమైనవే: మంత్రి అంబటి

మరిన్ని వార్తలు