కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ

14 Jan, 2023 16:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పారిశ్రామిక పురోగతికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరిస్తే దేశానికి సహకరించినట్లేనని లేఖలో పేర్కొన్నారు.

'దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా మారింది. తెలంగాణకు కేంద్ర ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులను కేటాయించాలి. హైదరాబాద్‌లో నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌ ఫార్మాసిటీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధికి తోడ్పాటు అందించాలి' అని కోరారు.

'హైదరాబాద్‌- విజయవాడ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి నిధులివ్వాలి. ఆదిలాబాద్‌లో సీసీఐ రీ ఓపెన్‌ చేయాలి. డిఫెన్స్‌ ఇండిస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ కారిడార్‌లో హైదరాబాద్‌ను చేర్చాలి. చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలి. ఐటీఐఆర్‌ లేదా సమాన ప్రాజెక్టు ఇవ్వాలి. జహీరాబాద్‌ నిమ్జ్‌కు కూడా నిధులు కేటాయించాలి' అని మంత్రి కేటీఆర్‌ లేఖలో కోరారు.

చదవండి: (అమెరికాలో సంపాదించి.. ఆంధ్రాలో పోటీ చేయాలని..!)

మరిన్ని వార్తలు