గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ‘కూచిపూడి డ్యాన్స్‌ లెసన్‌’

25 Dec, 2023 03:09 IST|Sakshi
నృత్యం చేస్తున్న కళాకారులు... గిన్నిస్‌ రికార్డుతో మంత్రులు జూపల్లి, సీతక్క తదితరులు

గచ్చిబౌలి స్టేడియంలో 3,783 మంది కళాకారుల ప్రదర్శన

గచ్చిబౌలి (హైదరాబాద్‌): తెలుగు వారి ప్రాచీన నృత్యం కూచిపూడి డ్యాన్స్‌ లెసన్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికా ర్డ్స్‌లోకి ఎక్కింది. ఏకకాలంలో 3,783 మంది కళా కారులు కూచిపూడి నృత్యంచేసి కళా వైభవాన్ని ప్ర పంచానికి చాటారు. ఆదివారం రాత్రి గచ్చిబౌలి అథ్లెటిక్‌ స్టేడియంలో భారత్‌ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వ ర్యంలో కూచిపూడి కళావైభవం పేరిట లార్జెస్ట్‌ కూచి పూడి డ్యాన్స్‌ లెసన్‌ ప్రదర్శించారు. స్టేడియం నలు మూలలా ఏడు నిమిషాలపాటు కళాకారులు నృత్యంచేస్తూ అలరించారు.

గురువు పసుమర్తి శేషు బాబు ఆధ్వర్యంలో కళాకారులు ఏకకాలంలో నృత్యం చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కారు. గిన్ని స్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అడ్జుడికేటర్‌ రిషినాథ్‌ నిర్వాహ కులకు సర్టిఫికెట్‌ను అందజేశారు. 2020లో త్యాగ రాయ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో చెన్నైలో ఏక కాలంలో 1,183 మంది కళాకారులు కూచిపూడి డ్యాన్స్‌ లెసన్‌ ప్రదర్శించారని రిషినాథ్‌ తెలిపారు.

కళలను ప్రోత్సహించి ప్రేరణ కల్గించాల్సిన అవస రం ఉందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పాఠశాల స్థాయి లోనే కళలను ప్రోత్సహించే సంఘాలుండాలని ఆ యన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ కూచిపూడి నృత్యం తెలుగువారికి ఎంతో ఇష్టమైందని, ఈ నృత్యరూపకం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్ర మంలో భారత్‌ ఆర్ట్స్‌ అకాడమీ అధ్యక్షురాలు లలిత, వ్యవస్థాపక అధ్యక్షుడు రమణారావు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు