మొబైల్‌లో మంత్రాలు.. ఆలయంలో పెళ్లి

4 Mar, 2021 11:30 IST|Sakshi

ఇంటర్నెట్‌ సాయంతో ఒక్కటైన ప్రేమ జంట

కేసముద్రం: వేదమంత్రాల నడుమ జరగాల్సిన పెళ్లికి సమయానికి అర్చకుడు హాజరుకాలేకపోయాడు. అయినా వివాహం మాత్రం ఆగలేదు. స్మార్ట్‌ఫోన్‌లో మరో అర్చకుడు మంత్రాలు చదువుతుండగా గుడిలో పెళ్లి కానిచ్చేశారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో ఈ వివాహం జరిగింది. ఒడిశాకు చెందిన కబీర్‌దాసు, కవిత కూలీ పనులు చేస్తుంటారు. నిరుపేదలైన ఈ ప్రేమజంటకి మహబూబాబాద్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ రవినాయక్‌ పెళ్లి చేసేందుకు ముందుకొచ్చారు.

తాళ్లపూసపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం పెళ్లికి ఏర్పాట్లు చేశారు. తీరా పెళ్లి సమయానికి అర్చకుడు మరో చోట కార్యం ఉండటంతో రాలేకపోయాడు. దీంతో కౌన్సిలర్‌ రవినాయక్‌తో పాటు స్థానికులు మరో అర్చకుడికి ఫోన్‌ చేశారు. ఆయన లైవ్‌లో మంత్రాలు చదువుతుండగా ప్రేమజంట ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

చదవండి:

వైరల్‌ : నీ టైం బాగుంది ఇంపాల

గుర్రం అంటే ఆయనకు ప్రాణం.. అందుకే..

మరిన్ని వార్తలు