రోడ్డుపై వరి కుప్ప.. ప్రమాదంతో ఒకరి మృతి 

9 May, 2021 10:42 IST|Sakshi

మరొకరికి తీవ్ర గాయాలు షాబాద్‌లో ఘటన 

షాబాద్‌: రోడ్డుపై ఆరబెట్టిన వడ్ల కుప్పతో ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన షాబాద్‌లో  చోటుచేసుకుంది. షాబాద్‌ సీఐ అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం తుర్కు ఎన్నెపల్లికి చెందిన చింతలపల్లి వీరేశ్‌ (27), అతని స్నేహితుడు జంగయ్యతో కలిసి హైతాబాద్‌ నుంచి షాబాద్‌కు మోటార్‌ బైక్‌పై శుక్రవారం రాత్రి వేళ వస్తున్నారు. మాచన్‌పల్లి స్టేజీ వద్ద రోడ్డుపై ఆరబెట్టిన వడ్ల కుప్పపై నల్లటి కవర్‌ కప్పటంతో గమనించక ప్రమాదానికి గురయ్యారు.

వీరేశ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయాలైన జంగయ్యను చికిత్స నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు