తెలంగాణలో ఎవరూ ఆకలితో అలమటించొద్దు

31 Aug, 2021 08:50 IST|Sakshi

బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌

హుజూరాబాద్‌: తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనేదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం హుజురాబాద్‌ నియోజకవర్గ తహసీల్దార్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నూతనంగా మంజూరైన రేషన్‌ కార్డులన్నింటినీ ప్రింట్‌ తీసి, లబ్దిదారుల ఇంటికి వెళ్లి కొత్త కార్డుతో పాటుగా, 5వ తేదీలోగా బియ్యం పంపిణీ కూడా చేపట్టాలని అధికారులకు సూ చించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతీ ఒక్కరికి తెలుపు రేషన్‌ కార్డు మంజూరు చేశామని వెల్లడించారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఎంతమందికి కొత్త రేషన్‌ కా ర్డులు మంజూరు అయ్యాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా మండలాలకు సంబంధించిన అ ధికారులు, తదితరులతో టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి మాట్లాడారు. కొత్త రేషన్‌ కార్డుల మంజూరు, బియ్యం పంపిణీ విషయాల గురించి తెలుసుకొని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో సీహెచ్‌. రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

చదవండి: ఉద్రిక్తతకు దారితీసిన ‘జెండా గద్దె పంచాయితీ’
చదవండి: తెలంగాణ సిగలో మరో అందం.. వెలుగులోకి కొత్త జలపాతం

మరిన్ని వార్తలు