సాయిచంద్‌ కుటుంబానికి రూ.కోటిన్నర ఆర్థికసాయం 

29 Aug, 2023 03:17 IST|Sakshi
సాయిచంద్‌ తండ్రి, సోదరికి చెక్కులను అందిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్,  చిట్టెం, బాల్క సుమన్‌

బడంగ్‌పేట్‌/అమరచింత: ప్రజా గాయకుడు, దివంగత నేత సాయిచంద్‌ కుటుంబానికి సీఎం కేసీఆర్‌ అండగా ఉన్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. బడంగ్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని గుర్రంగూడలో నివాసం ఉంటున్న సాయిచంద్‌ సతీమణి రజినీకి సోమవారం ప్రభుత్వం తరఫున రూ.కోటి చెక్కును ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి అందజేశారు.

అనంతరం రజినీతో పాటు చిన్నారులను ఓదార్చారు.కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్, జెడ్పీ చైర్‌పర్మన్‌ తీగల అనిత తదితరులు పాల్గొన్నారు.

 రజనికి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. చిత్రంలో మంత్రి సబితారెడ్డి, దాసోజు 

సాయిచంద్‌ తండ్రి, చెల్లెలికి చెక్కుల అందజేత 
అణగారిన వర్గాల బాధలను, ఆంధ్ర పాలకుల నైజాన్ని ఎండగట్టిన మహాగాయకుడు సాయిచంద్‌ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సాయిచంద్‌ తండ్రి వెంకట్రాములు, చెల్లెలు ఉజ్వలకు చెరో రూ.25 లక్షల చొప్పున చెక్కులను స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు