సీఎం కేసీఆర్‌ స్వయంగా యశ్వంత్‌ సిన్హాని రిసీవ్‌ చేసుకుంటారు: తలసాని

1 Jul, 2022 18:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా శనివారం ఉదయం హైదరాబాద్‌కు రానున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ తెలిపారు. ఈ మేరకు జలవిహార్‌లో మంత్రి తలసాని మాట్లాడుతూ.. 'యశ్వంత్‌సిన్హా పర్యటనలో ముఖ్యమంత్రి సహా మంత్రులు, గ్రేటర్‌ ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా యశ్వంత్‌ సిన్హాని రిసీవ్‌ చేసుకుంటారు. బేగంపేట నుంచి ఖైరతాబాద్‌ మీదుగా జలవిహార్‌ వరకు ర్యాలీగా వస్తారు. రాష్ట్రపతి ఎన్నికలో ఓటింగ్‌లో పాల్గొనే వారందరూ ఇక్కడ పాల్గొంటారు.

ఓ వైపు బీజేపీ మీటింగ్‌ జరుగుతుంది. మరోవైపు యశ్వంత్‌ సిన్హా సమావేశం జరుగుతంది. ఈ ఎనిమిదేళ్లో బీజేపీ దేశానికి చేసిందేమీ లేదు. వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణలో పప్పులు ఉడకవు. రేపు హైదరాబాద్‌కి వచ్చే నేతలు నగర అందాలని చూస్తారు. ఈ మూడు రోజులు అనేక మంది టూరిస్టులుగా వచ్చి చూసి వెళ్లిపోతారు. దేశంలో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా మూడేళ్లయింది. సికింద్రాబాద్‌లో ఏ పని చేశారో చెప్పాలి. బీజేపీ తాటాకు చప్పుళ్లకు టీఆర్‌ఎస్‌ భయడదు' అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు.

చదవండి: (కిషన్‌రెడ్డి చేతగాని దద్దమ్మలా మిగిలిపోయారు: బాల్కసుమన్‌)

మరిన్ని వార్తలు