Hyderabad: సిటీలో నేటి నుండి కొత్త ట్రాఫిక్ విధానం

21 Feb, 2024 09:10 IST|Sakshi

నగరంలోకి వీటి రాకపోకలు పూర్తిగా నిషేధం 

ప్రతి కేటగిరీకీ నిరీ్ణత సమయం కేటాయింపు 

ఉత్తర్వులు జారీ చేసిన నగర పోలీసు కమిషనర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలతో పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగించడానికి పోలీసు విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. సిటీలోకి భారీ వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిషేధిస్తూ కొత్వాల్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి ఉన్న వాహనాలకు సైతం నిర్ణీత సమయాలు కేటాయించారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని, అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

నగరంలో ఉన్న రహదారుల్ని మొత్తం 91 రకాలైన రూట్లుగా పోలీసులు విభజించారు. వీటిలో కొన్నింటిలో కొన్ని రకాలైన వాహనాలను నిషేధించడం, నిర్దేశిత సమయాలు కేటాయించడం చేశారు. ఈ మార్గాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆయా వాహనాలు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో కూడిన కమర్షియల్‌ వాహనాలు నగరంలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించారు.  

లోకల్‌ లారీలతో పాటు నిర్మాణ సామాగ్రి తరలించే 10 టన్నుల కంటే ఎక్కవ బరువుతో కూడిన వాహనాలు రాత్రి 11 ఉదయం 7 గంటల మధ్య మాత్రమే నగరంలో సంచరించాలి. 

♦ డీసీఎం, ఐచర్, స్వరాజ్‌ మజ్దా వంటి మధ్య తరహా గూడ్స్‌ వాహనాలు (3.5 టన్నుటు–12 టన్నుల మధ్య బరువుతో కూడినవి) మధ్యా హ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు మాత్రమే తిరగాలి.  

♦ ప్రైవేట్‌ బస్సులు కేవలం రాత్రి 10 నుంచి ఉ. 8 గంటల మధ్యనే నగరంలో ప్రయాణించాలి.  

♦ అత్యంత నెమ్మదిగా నడిచే కేటగిరీకి చెందిన చేతితో తోసే బళ్లు, వివిధ రకాలైన జంతువులు లాగే బళ్లు, సైకిల్‌ రిక్షాలు, ట్రాక్టర్లు తదితరాల సంచారాన్ని నగరంలోని కీలకమైన 61 టూర్లలో నిషేధించారు.  

♦ భవన నిర్మాణ, కూలి్చవేత వ్యర్థాలను తరలించే వాహనాల్లో 2 నుంచి 6 టన్నుల మధ్య బరువు కలిగినవి ఉ. 11.30 నుంచి సాయంత్రం 5, రా త్రి 10 నుంచి ఉదయం 9 మధ్య సంచరించాలి.  

♦ వీటిలో 10 టన్నులు అంతకంటే ఎక్కువ బరువుతో కూడిన వాహనాలు కేవలం రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల మధ్య మాత్రమే నగరంలో సంచరించాలి.  

whatsapp channel

మరిన్ని వార్తలు