‘స్ట్రీట్‌ ఫైట్‌’.. పరేషాన్‌!

14 Jun, 2021 21:16 IST|Sakshi

విచక్షణ మరిచి.. యువత వీధిపోరాటం

‘షో’ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వైనం 

ఆపరేషన్‌ చబుత్రతో కొంత వరకు ఫలితం 

సుదీర్ఘ విరామం తర్వాత ప్రారంభం 

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన బాలురు, యువతి వాస్తవాలను మరిచి స్టంట్స్‌ చేస్తున్నారు. రియాల్టీ షోల కోసం, రియల్‌ హీరోయిజం చూపడానికి రెచ్చిపోతున్నారు. ఫలితంగా ప్రాణాలు కోల్పోవడం.. తీయడం చేస్తూ కన్నవాళ్లకు కడుపు కోతను మిగుల్చుతున్నారు. ఒకప్పుడు ఓల్డ్‌ సిటీలో చేపట్టిన ఆపరేషన్‌ చబుత్ర మంచి ఫలితాలు ఇచ్చింది.  

► కరోన ప్రభావంతో గత ఏడాది నుంచి అది ఆగిపోవడంతో పరిస్థితి మళ్లీ తప్పింది. గత వారం డబీర్‌పురా పరిధిలో చోటు చేసుకున్న మహ్మద్‌ అద్నాన్‌ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. దీన్ని మరిచిపోక ముందే 2015లో మీర్‌చౌక్‌ ప్రాంతంలో జరిగిన స్ట్రీట్‌ఫైట్‌ కేసు కోర్టులో వీగిపోవడం పోలీసులకు శరాఘాతంగా మారింది.  మేల్కొన్న మూడు కమిషనరేట్ల అధికారులు మళ్లీ ఆపరేషన్‌ చబుత్రలు మొదలెట్టారు. 

తరచు విషాదాలు... 
► నగరంలో తరచు ఏదో ఒక ఉదంతం వెలుగులోకి వస్తూనే ఉంటోంది. టీవీ షోల ప్రభావానికి లోనవుతున్న వారిలో టీనేజర్లే ఎక్కువగా ఉంటున్నారు రెజ్లింగ్‌తో ప్రేరణ పొందిన కొందరు యువకులు 2015 మేలో పాతబస్తీలో వీరంగం సృష్టించారు. 
► ఫంజెషా బస్తీలో ఏడుగురు యువకుల మధ్య ప్రారంభమైన పందెం స్ట్రీట్‌ ఫైట్‌కు దారి తీసింది. 17 ఏళ్ల నబీల్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసు ఇటీవల నాంపల్లి కోర్టులో వీగిపోయింది. 
► బార్కాస్‌ ప్రాంతానికి చెందిన జలాలుద్దీన్‌(19) శాలిబండలోని గౌతం జూనియర్‌ కాలేజీలో ఇంట ర్‌ ప్రథమ సంవత్సరం చదివేవాడు. కలర్స్‌ చానల్‌ నిర్వహించిన ‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’ రియాల్టీ షోలో పాల్గొనాలనే కోరిక ఇతడికి ఉండేది. 
► ‘ఫియర్‌ ఫ్యాక్టర్‌–ఖత్రోంకే ఖిలాడీ’ సిరీస్‌కు ఎంట్రీ వీడియో తీసే ప్రయత్నాల్లో ఒంటికి నిప్పు పెట్టుకున్నాడు. 60 శాతం కాలి ఐదు రోజుల పాటు చికిత్సపొంది తుదిశ్వాస విడిచాడు. 

బైక్‌ రేసులు సైతం... 
ఓ ప్రాంతంలో నిఘా ఉంచి ‘రేసర్లను’ పట్టుకుంటున్నారు. వారితో పాటు తల్లిదండ్రుల్నీ పిలిచి కౌన్సిలింగ్‌ చేస్తున్నారు. ఈ చర్యలతో కొన్ని రోజులు మిన్నకుండిపోతున్న యువత... ఆపై ప్లేసులు మార్చి మళ్లీ రెచి్చపోతున్నారు.   

మరిన్ని వార్తలు