పాపం పసివాడు.. తల్లి ఇంట్లోకి వెళ్లి వచ్చే సరికి!

1 Apr, 2021 08:34 IST|Sakshi
అభినయ్‌ మృతదేహం 

ప్రమాదవశాత్తు సంపులో పడి చిన్నారి మృతి 

సాక్షి, ఖైరతాబాద్‌: అప్పటివరకు గోరుముద్దలు తినిపించిన తల్లి ఇంట్లోకి వెళ్లి వచ్చే సరికి రెండున్నరేళ్ల బాలుడు ఇంటిముందు ఉన్న సంపులో పడి మృతిచెందిన సంఘటన సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖైరతాబాద్‌ డివిజన్, బీజేఆర్‌నగర్‌కు చెందిన ఉపేందర్, నాగేశ్వరి దంపతులకు అభినయ్‌(2.5 ) కుమారుడు ఉన్నాడు. ఉపేందర్‌ గత కొంత కాలంగా కర్నాటకలో ఉంటుండగా నాగేశ్వరి కుమారుడితో కలిసి రేకుల ఇంట్లో ఉంటోంది. మంగళవారం రాత్రి బాబుకు అన్నం తినిపించి ఇంట్లోకి వెళ్లింది.

అరగంట తర్వాత బయటికి వచ్చి చూడగా బాబు కనిపించలేదు. దీంతో అతడి కోసం గాలించగా నీటి సంపులో క నిపించాగు. చిన్నారికి బయటికి తీసి వెంటనే వాస వి హాస్పిటల్‌కు, అక్కడి నుంచి నిలోఫర్‌ హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నీటి సంపుపై కప్పు లేనందునే ప్రమాదవశాత్తు బాలు డు అందులో పడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రతి ఒక్కరు సంపులపై మూతలు ఉండేలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

చదవండి: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. !

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు