సాక్షి కథనం: విజయ్‌ చదువుకు కేటీఆర్‌ హామీ

21 Jul, 2021 10:42 IST|Sakshi

సాక్షి, కేసముద్రం(వరంగల్‌): హాస్టల్‌ ఫీజు చెల్లించలేని ఓ గిరిజన ఎంబీబీఎస్‌ విద్యార్థి పరిస్థితిపై ఈ నెల 19న ‘సాయం చేయండి..ప్లీజ్‌’ కథనం ప్రచురితమైంది. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న కేసముద్రంస్టేషన్‌కి చెందిన లవణ్‌పటేల్‌  సాక్షిలో  ప్రచురితమైన ‘సాయం చేయండి ప్లీజ్‌’ కథనాన్ని మంగళవారం మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ స్పందించి, నేను చూసుకుంటానని ట్విట్టర్‌ ద్వారా హామీ ఇచ్చాడు.

కేటీఆర్‌ ఆఫీస్‌ అధికారులను కోఆర్డినేట్‌ చేయాలంటూ మంత్రి ఆదేశించారు. ఈ మేరకు కేటీఆర్‌ ఆఫీసు నుంచి  గోప్యాతండాలో నివాసం ఉండే  వ్యక్తికి  ఫోన్‌ చేసి తన వివరాలను అడిగారని, మళ్లీ త్వరలోనే సమాచారం అందిస్తామని చెప్పినట్లు ఎంబీబీఎస్‌ విద్యార్థి విజయ్‌ తెలిపారు.  తమ ఇబ్బందులను వెలుగులోకి తీసుకువచ్చిన సాక్షి దినపత్రికకు,  ట్విట్టర్‌ ద్వారా స్పందించి హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్‌కు విజయ్‌ కుటుంబ సభ్యులు  కృతజ్ఞతలు తెలిపారు.

     

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు