సంగారెడ్డి: టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీలో పేలిన బాణాసంచా.. ఒకరి పరిస్థితి విషమం

15 Nov, 2022 13:01 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి: జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన బైక్‌ ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. మంగళవారం తెలంగాణలో ఎనిమిది కొత్త మెడికల్‌ కాలేజీల ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. సంగారెడ్డి కాలేజీ ప్రారంభోత్సవ ర్యాలీలో బాణాసంచా పేల్చారు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.

అయితే బాణాసంచా ఉన్న ఆటోకి మంటలు అంటుకుని.. భారీ శబ్ధాలతో పేలిపోయాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, మంటలు అంటుకుని ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు ప్రాణాపాయం తప్పింది. స్వల్ఫ గాయంతో ఆయన బయటపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వాళ్లకు చికిత్స అందుతోంది.

ఇదీ చదవండి: అలా కాదు.. ఇలా ఉంటాడు..

మరిన్ని వార్తలు